మొదటి ప్రయత్నంలోనే సంచలనాలు సృష్టించిన విద్యార్థులు…
పరీక్షలు హాజరైన విద్యార్థులలో 70 శాతం మంది క్వాలిఫై…
స్టేట్ ఫస్ట్ ఫలితాలతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన బిరం విద్యాసంస్థల చైర్మన్ సుబ్బారెడ్డి….
బీరం కళాశాల రాష్ట్రంలో నెంబర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సిబ్బంది…
జేఈఈ మెయిన్స్ ఫలితాలలో బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంతో బీరం విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. 2023 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో 99.92 శాతం మార్కులతో పదుల సంఖ్యలో ఉత్తమ ఫలితాలను సాధించడమే గాక పరీక్ష రాసిన విద్యార్థులలో 70 శాతం మంది క్వాలిఫై కావడం తమ కళాశాల అత్యుత్తమ ప్రతిభకు నిదర్శనమని ఆ కళాశాల చైర్మన్ బీరం సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుల లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఏకైక సంస్థ బీరం కళాశాల అని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించడం పట్ల విద్యార్థులు తమ అనుభవాలను తోటి విద్యార్థులతో పంచుకున్నారు. కళాశాల యాజమాన్యం లెక్చరర్లు కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉత్తమ ఫలితాలను సాధించేలా కృషి చేస్తామని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉత్తమ విద్యను అందించడమే బిరం కళాశాల ముఖ్య ఉద్దేశమని కళాశాల యాజమాన్యం పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను, సిబ్బందిని ఆ కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి , ప్రిన్సిపల్ శ్వేత, లెక్చరర్లు సిబ్బంది పాల్గొన్నారు.