ర్యాంకులు, పర్సెంటైల్ ఏ కాదు క్రీడల్లో కూడా మాదే విజయం అని బీరం కళాశాల విద్యార్థులు నిరూపించారు
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు ప్రభుత్వ కళాశాలలో ఎస్ జి ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్- 19 టైక్వాండో మరియు వ్రేజిలింగ్ జిల్లాస్థాయి క్రీడల్లో వైయస్సార్ కడప జిల్లా బీరం జూనియర్ కళాశాల – కడప విద్యార్థి అయిన వేముల ముని చైతన్య (ఇంటర్ ఫస్టియర్) విద్యార్థి అత్యుత్తమమైన ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయిలో రెండు బంగారు పతకాలను సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా బీరం విద్యాసంస్థల అధినేత మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అయిన బీరం సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తూ మనల్ని గెలుపు బాటలో నడిపిస్తుందని, ఒకటి కాదు రెండు బంగారు పత కాలు సాధించిన ఘనత బీరం జూనియర్ కళాశాల – కడప విద్యార్థులకు సొంతమని క్రీడల్లోనే కాదు ర్యాంకులు సాధించడంలో కూడా బీరం విద్యాసంస్థల దే ఎప్పుడూ తొలిమెట్టని వారు తెలిపారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థి ముని చైతన్యను ఘనంగా సత్కరించి, అభినందించారు.
కార్యక్రమంలో బీరం విద్యా సంస్థల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు, బీరం జూనియర్ కళాశాల -కడప ప్రిన్సిపల్ బషీర్ అహమ్మద్,వైస్ ప్రిన్సిపల్ సుధారాణి, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి క్రీడల్లో బంగారు పతకాలను సాధించిన బీరం కళాశాల -కడప విద్యార్థి
RELATED ARTICLES