మనభారత్ న్యూస్ /మైదుకూరు
ఖాజీపేట మండల బీరం నగర్ బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాల నందు మంగళవారం నాడు కిండర్ గార్టెన్ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీరం అంతర్జాతీయ పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి గారు,చైర్పర్సన్ సరస్వతమ్మ గారు, డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు మరియు ముఖ్య అతిథిగా గ్రూప్-1 ఆఫీసర్ బీరం శ్రీకాంత్ రెడ్డి గారు విచ్చేశారు.చిన్నారుల కేరింతలతో, సందడితో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి చిన్నారులు వారి యొక్క తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుబ్బారెడ్డి గారు మరియు సరస్వతమ్మ గారు మాట్లాడుతూ ఈరోజు చిన్నారులకు చాలా ప్రత్యేకమైన రోజు అని, చిన్నారులు వారి ప్రీ స్కూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందని వారి ఈ ఆనందం ఎల్లప్పుడూ కొనసాగాలని, వారు భవిష్యత్తులో అత్యుత్తమ లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని అవలీలగా చేదించి , ఉన్నత స్థానాలను అధిరోహించి,అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశీర్వదించారు. అదేవిధంగా ముఖ్య అతిథి అయిన శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పునాది స్థాయి నుంచి విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా ఒక ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చునని, నాణ్యమైన విద్యా ప్రమాణాల పట్ల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, కిండర్ గార్టెన్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వారిని అభినందించి,తమ విద్యాసంస్థలు నూతన విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యారంగంలో చెరగని ముద్ర వేశామని, భవిష్యత్తులో కూడా అందరికీ నిర్దిష్ట విద్యా ప్రణాళికతో అత్యున్నత విద్యను అందిస్తామని అలాగే తమ ప్రయాణంలో ఎల్లప్పుడూ తోడుగా ఉన్న విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసి వారి సహకారం అన్నివేళలా తమకు కావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ శ్వేతా గారు మాట్లాడుతూ చిన్నారుల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనదని, వారు తమ చిన్నారులను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ, వారి అభివృద్ధిలో భాగస్వామ్యులుగా కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చిన్నారుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి, సంపూర్ణ ఎదుగుదలకు పాఠశాలలో అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని తమ చిన్నారుల పురోగతిని పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. చిన్నారులు వివిధ రకాల వేషధారణలతో, నృత్య ప్రదర్శనలతో మరియు తమ ప్రసంగాలతో అందరినీ అలరించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాజమాన్యం చేతుల మీదగా చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే యొక్క బంగారు పథకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.