వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
మునిసిపల్ చైర్ పర్సన్
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ ప్రగతి లో బాగంగా
కోదాడ పురపాలక సంఘం పరిధిలో పద మూడవ రోజు 30, 12, 26 వ వార్డ్ ల్లో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. 26 వ వార్డ్ పరిధి లోని బస్ స్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న క్లీనింగ్ పనులపై సంతృప్తి ని వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంగణం అంతా ప్రకృతి వనం లా సుందరీకరించాలని, వచ్చే హరితహారంలో భాగంగా ఆ ప్రాంతం అంతా పూలు మరియు పండ్ల మొక్కలతో నింపాలని అధికారులకు సూచించడం జరిగింది.
వీరితో పాటు కమీషనర్ మహేశ్వర రెడ్డి గారు, వార్డ్ కౌన్సిలర్ ఫాతిమా ఖాజా మొయినుద్దీన్,SK షఫీ, సుశీల రాజు గారు, బస్ డిపో మేనేజర్ హర్ష గారు, AE వరుణ్, సానిటోరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, యాదా సుధాకర్, చలిగంటి వెంకట్, బషీర్ గారు, మునిసిపల్ సిబ్బంది మరియు బస్ డిపో సిబ్బంది మరియు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు…