జాడ తెలియని నేపాల్ విమానం తార
న్యూడిల్లీ: నేపాల్ విమానమొకటి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది.. ఆదివారం ఉదయం తారా ఎయిర్ కు చెందిన 9 NAET ట్విన్ ఇంజన్ విమానం ఆచూకీ గల్లతైంది..ఈ విమానం పోఖారా నుండి నేపాల్ లోని జోమ్ సోమ్ కు వెళ్తుండగా ఉదయం 9.55 నుండి ఏటిసితో సంబందాలు తెగిపోయాయని అధికారులు చెబుతున్నారు.. కాగా జోమ్ సోమ్ సమీపంలోని దౌలత్ గిరి పర్వతం వైపు మళ్ళీన తర్వాతే ఏటిసితో సంబందాలు తెగిపోయినట్టు తెలుస్తోంది…
తప్పిపోయిన విమానంలో ముగ్గురు విమాన సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు ఉండగా వారిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీస్ ఉన్నట్టు సమాచారం. విమానం సిగ్నల్స్ కట్ అవడంతో గాలింపు చర్యల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు తారా ఎయిర్ ప్రతినిధి తెలిపారు..ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం తారా విమానం కోవాంగ్ సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయిందని తెలుస్తోంది…