ఆంధ్రప్రదేశ్ కాత్వ కడప జిల్లా సమావేశం మేధా డిఫెన్స్ అకాడమీ నందు జరిగింది. కడప జిల్లా ఎస్ టి యు ఆర్థిక కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నికైన గోశెట్టి రామమోహన్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎస్ టియూ ఉపాధ్యాయులు వక్తలు మాట్లాడుతూ ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘము లో ఆర్థిక కార్యదర్శిగా చిన్న తనంలో ఉన్నత స్థానానికి ఎదగడం సంతోషాదాయకమన్నారు.ఉపాధ్యాయ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ, అందరిని కలుపుకొని సంఘాన్ని బలోపేతం చేయాలనీ కోరారు.ఎస్టియు జిల్లాలో మైదుకూరు లో అత్యంత బలంగా రెండువందల పైబడి సభ్యత్వాలు కలిగి ఉండటం సంతోషం అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.అనంత రం కాత్వ రాష్ట్ర నాయకులు చెన్నంశెట్టి నరసింహులు, మైదుకూరు నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కరెడ్ల కృష్ణ,గౌరవ అధ్యక్షుడు బొమ్మిశెట్టి మోహన్ పాత్రికేయులు బంధుమిత్రులు పూలమాలలు, శాలువా లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలోకాత్వ గౌరవ అధ్యక్షుడు నరసింహులు, వెంకట రమణ, బండి సత్యం, పాల కొండయ్య, సురేష్, రాజు ఎస్ టి యు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాత్వ ఆధ్వర్యంలో ఎస్ టి యు ఆర్థిక కార్యదర్శిగా ఎన్నికైన గోసెట్టి రామ్మోహన్ కు సన్మానం…
RELATED ARTICLES