కడప జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఏవి రమణను కాజీపేట ఎస్సై వేధింపులకు గురిచేయడంతో స్పృహ కోల్పోయినట్లు ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనంలో కడప నుండి మైదుకూరుకు వచ్చే క్రమంలో ఆయనను మధ్యలో ఆపి వేధింపులు గురి చేసినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఆపిన పోలీసులు నీవు ఎవరు అని అడగగా తాను రైతు సంఘం అధ్యక్షుడునని నా పేరు ఏవి రమణ అని తెలుపగా వాహనానికి సంబంధించిన ఆధారాలను చూపమని చెప్పడంతో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ లైసెన్స్ లేదని చెప్పడం జరిగిందని, పైన్ వేయమని కోరగా బండిపై రైతు సంఘం అని రాసుకుంటే నువ్వు పెద్ద లీడర్వా అంటూ, లీడర్ అంటే స్కార్పియో ,ఇన్నోవాలు ఉండాలని ఎస్సై హేళనగ చేస్తూ దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురిచేయడంతో ఆయన బీపీ అధికమై కోల్పోయి కింద పడిపోవడంతో స్థానికులు గమనించి ప్రథమ చికిత్స చేసి కాపాడారని ఆయన తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులు రైతు సంఘం నాయకులు అక్కడికి చేరుకోవడంతో తనను పంపడం జరిగిందని తెలిపారు
