మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త ,సౌమ్యుడు, స్నేహశీలి ,సంఘ సేవకుడు సూరిశెట్టి ప్రసాద్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో శనివారం అమ్మవారి శాల నందు అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆర్యవైశ్య సభ మాజీ అధ్యక్షుడు నేతి రెడ్డయ్య అమ్మవారి సాక్షిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ అత్యంత ప్రాశిష్ఠమైనదన్నారు. నూతన అధ్యక్షుడు మంచి సేవ కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడుగా ఎన్నికైన సూరిశెట్టి ప్రసాద్ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ మైదుకూరు ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను అన్నారు. ఆర్యవైశ్యులు అండగా ఉంటూ అమ్మవారి శాలను అభివృద్ధి చేస్తానన్నారు. అందరి సహాయ సహకారాలతో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నరూ. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సభ అధ్యక్షుడుగా సూరిశెట్టి ప్రసాద్ గుప్త ప్రమాణ స్వీకారం…
RELATED ARTICLES