చదువులమ్మ ఒడిలో కలిసిన మిత్రులు 25 సంవత్సరాల తర్వాత కలయిక
భారత్ న్యూస్/మైదుకూరు
మైదుకూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (1997–98) ఆగష్టు 15 వ తేదీ సాయంత్రం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఆవరణంలో ఆహ్లదకరంగా ఆత్మీయపలకరింపులతో ప్రారంభమైంది.
25 సంవత్సరంల ముందు చదువులమ్మ ఒళ్ళో కలిసిమెలిసి చదివిన సరస్వతి పుత్రులతో పాఠశాల ఆవరణమంతా పులకించిపోయింది . ఆనాటి మిత్రులందరూ ఒక్కొక్కరుగా పాఠశాల ఆవరణంలో వస్తుంటే ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ,వయసు ,హోదా మరిచిపోయి ఒకరి నొకరు పలకరించుకుంటూ వారి యోగక్షేమాలు తెలుపుకుంటూ పండుగ వాతావరణం నెలకొంది.
ఆనాడు ఇక్కడ చదువుకున్న వారంతా వివిధ వృత్తులలో గవర్నమెంటు అధికారులుగా రాజకీయంగా ఉన్నత పదవులు పొందినవారు, వ్యాపారస్తులుగా ,ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఇక్కడకు వచ్చి వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందం గా కేరింతలు కొట్టారు .
ఆనాడు వారికి విద్యాబోధన చేసిన గురువులను కూడా ఆహ్వానించి వారితో ఉన్న అనుబంధాలను స్మరించుకుంటూ వారి దీవెనలు పొందారు .ఆనాటి గురువులు ఉన్నత పదవులలో ఉన్న తమ శిష్యులను చూసి ఆనందంతో పరవశించిపోయారు.
ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన గురువులను ఘనంగా సత్కరించారు.