పుంగనూరు ఘటన పై మైదుకూరు టిడిపి ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారి పై రాళ్ల దాడి హేయమైన చర్యా అన్నారు పులివెందుల కంటే పుంగనూరులో అరాచకం ,రౌడీయిజం రాజ్యమేలుతోందన్నారు .రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పరిశీలించేందుకు యుద్ధభేరి కార్యక్రమాన్ని చేపట్టారు…
తాగునీటి ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ,టిడిపి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ప్రజలకు చెప్పేందుకు కార్యక్రమం చేపట్టడం జరిగింది…పుంగనూరులో చేసిన రాళ్లదాడిని ఎవరు వెనకుండి ఏ విధంగా చేశారో పరిశీలించి టిడిపి ప్రభుత్వం వచ్చాక అంతకు రెండింతలు రిటన్ గిఫ్ట్ ఇస్తామన్నారు .అరాచకానికి పరాకాష్టగా పుంగనూరు లో వైసీపీ నాయకులు తయారయ్యారు…
జగన్మోహన్ రెడ్డి కన్నా పుంగనూరు వైసీపీ నాయకుడి అరాచకాలు ఎక్కువయ్యాయి…
ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు తగిన గుణపాఠం దగ్గర్లోని చెబుతారు.