ప్రముఖ నగరాలలో అందుబాటులో ఉన్న అధునాతన మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స ఇప్పుడు మైదుకూరు పట్టణంలోనీ హెచ్ సి సి హాస్పిటల్ లో అత్యంత తక్కువ ధరలో కేవలం లక్ష రూపాయలకే అందిస్తున్నట్లు హెచ్సిసి హాస్పిటల్ ఎం .డి భూమి రెడ్డి చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మొట్టమొదటి మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ,తిరుపతి మహ నగరాలకు దీటుగా మైదుకూరు పట్టణంలో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గంజికుంటకు చెందిన మహిళకు మోకాలు మార్పిడి విజయవంతంగా చేసి మరుసటి రోజు నడిచేలా చేయడం జరిగిందన్నారు.
అధునాతన మోకాలుమార్పిడి శస్త్ర చికిత్స కేవలం లక్ష రూపాయలకే… HCC హాస్పిటల్ ఎం.డి భూమిరెడ్డి చంద్రశేఖర్
RELATED ARTICLES