విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరం…
బీరం విద్యాసంస్థలు విద్యార్థుల పట్ల వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషి హర్షనీయం.. డిప్యూటీ డిఈఓ రాజు
ఖాజీపేట మండలం కడప- కర్నూలు జాతీయ రహదారి శ్రీధర్ రెడ్డి నగర్ లో ఉన్న శ్రీ బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల ఆవరణలో ఎ.స్జి.ఎఫ్. ఆధ్వర్యంలో అండర్ -14, అండర్ -17 కోకో పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ డి.ఈ.ఓ. సి.రాజగోపాల్ గారు,స్కూల్ గేమ్స్ సెక్రెటరీ
ఎస్. జిలాని భాషగారు ,ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి. శివ శంకర్ రెడ్డి గారు విచ్చేశారు.
ఈ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ అయినటువంటి ఎస్.జిలాని భాష గారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని విద్యార్థులు వివిధ రకాల పోటీల్లో పాల్గొని వారిలోని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ప్రైవేట్ సంస్థల పాఠశాల యాజమాన్యం తమ సంస్థల అభివృద్ధి కోసమే పనిచేస్తాయని కానీ బీరం విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థుల అభివృద్ధి తమ సంస్థ అభివృద్ధి అని భావించి ఆ దిశగా అడుగులు వేసి తక్కువ సమయంలోనే మంచి పురోగతి సాధించినదని ఆయన తెలియజేశారు.
మరియు ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన బి. శివశంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కోకో పోటీలు తమ పాఠశాలలో నిర్వహించడానికి అనుమతి ఇచ్చినందుకు బీరం యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.స్కూల్ అంటే చదువే కాదు క్రీడలు కూడా అందులో భాగమని భావించి 20 మంది పీ.ఈ.టీలతో బీరం విద్యాసంస్థలు ఫిజికల్ ఎడ్యుకేషన్ పై పెద్దపీట వేశారని, క్రీడల వల్ల మనోళ్లాసం,మానసిక ఏకాగ్రత, తెలివితేటలు అభివృద్ధి చెందుతాయని, ఆటలు బాగా ఆడే పిల్లలు విద్యలో కూడా బాగా రాణిస్తారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
మరియు డిప్యూటీ డి.ఈ.ఓ.సి. రాజ గోపాల్ గారు మాట్లాడుతూ 160 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో క్రీడల పట్ల చాలా తక్కువ ఆసక్తి చూపుతారని అంతర్జాతీయ క్రీడల్లో భారతదేశం నుంచి తగిన స్థాయిలో క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపటం లేదని ఆ పరిస్థితిని మార్చి భారతదేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని,విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉండి క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని ఆయన తెలియజేశారు.పాఠశాల అధినేత అయిన బీరం సుబ్బారెడ్డి సార్ గారు, చైర్ పర్సన్ సరస్వతమ్మ గార్లు మాట్లాడుతూ విద్యార్థులు ఆటలాడటం చాలా ముఖ్యమని అందుకే తమ పాఠశాలలో క్రీడలకు అంత పెద్ద పీట వేశామని ఆయన చెప్పారు. అలాగే ఈరోజు తమ పాఠశాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నందుకు గర్విస్తున్నానని, అలాగే విద్యార్థులు బాగా ఆడి తమ స్కూల్ పేరు,జిల్లా పేరు, జాతీయస్థాయిలో నిలబెట్టాలని ఆయన తెలియజేశారు.
డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు ప్రిన్సిపల్ శ్వేతా మేడం గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రీడలు తమ పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు, వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు ఇక్కడికి పోటీలో పాల్గొనడానికి రావడం,ఇలాంటి కార్యక్రమాలు తమ పాఠశాలలో నిర్వహించాలని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే ఈ కార్యక్రమాన్ని పి.ఈ.టిలు ముందుండి నిర్వహించినందుకు వారిని అభినందించారు.