విజయానికి మారుపేరు, ర్యాంకులు పుట్టినిల్లు అవి సాధించడంలో బ్రాండ్ గా నిలిచిన* బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో దశాబ్ది వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప మున్సిపల్ కమిషనర్ నందన్ గారు మరియు డిప్యూటీ కమిషనర్ రాజేష్ గారు విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ బీరం శ్రీధర్ రెడ్డి విద్యా సంస్థలు రాయలసీమ జిల్లాలోని ఎంతో ప్రసిద్ధిగాంచి పేరు పొందిన విద్యాసంస్థలని, ఈ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించడం అనేది విద్యార్థుల యొక్క అదృష్టమని తెలిపారు.భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తపన ఉన్న విద్యార్థులకు ఈ బీరం విద్యాసంస్థలు ఒక వేదిక అవుతుందన్నారు. ప్రారంభించిన పది సంవత్సరాలలోనే ఇంత గొప్ప అభివృద్ధి ని సాధించి ఇంకొక బ్రాంచ్ ను కూడా ప్రారంభించడం అనేది గొప్ప విషయం అన్నారు.
కార్యక్రమంలో కడప జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు బీరం విద్యాసంస్థల అధినేత అయిన బీరం సుబ్బారెడ్డి గారు, చైర్ పర్సన్ సరస్వతమ్మ గారు మాట్లాడుతూ మా కుమారుడైన బీరం శ్రీధర్ రెడ్డి ఆశయాలకు, ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల అని,ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ముఖంలో కూడా మా కుమారుడు శ్రీధర్ రెడ్డి మాకు కనిపిస్తాడని వారు ఈ సందర్భంగా తెలిపారు.ఇక్కడ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో గొప్ప స్థానంలో చూడాలని ఆశ మాకు ఉందని దానికోసం మేము మరియు మా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తాము అన్నారు.
ఈ ఆనందోత్సవ వేడుకలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు,డాన్సులు మరియు నవదుర్గ అలంకారాలు అందరిని ఆకర్షించాయి.
కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు, పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత, కళాశాల ప్రిన్సిపల్ హేం చందర్, కడప బ్రాంచ్ ప్రిన్సిపల్ బషీర్ అహ్మద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
అంబరాన్నంటిన బీరం దశాబ్ది వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు …
RELATED ARTICLES