చాపాడు మండలం విశ్వనాధ పురం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ,ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ప్రారంభించారు. విశ్వనాధపురం టిడిపి నాయకులు కార్తిక్ రెడ్డి సతీమణి అనురాధ అంగన్వాడి కార్యకర్త హేమ టిడిపి నాయకులు అనుచరులు పెద్ద ఎత్తున ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు . పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్తీక్ రెడ్డి నివాసానికి వెళ్లారు .విశ్వనాధపురం గ్రామంలోని సమస్యలను కొన్నింటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళగా సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపుతానన్నారు అని కార్తీక్ రెడ్డి తెలిపారు. అయన వెంట చాపాడు మండల నాయకులు పాల్గొన్నారు
అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎంపీ మహేష్…
RELATED ARTICLES