కడప జిల్లా….
రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు నియామకమైన సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరగమ్ రెడ్డి తిరుపాల్ రెడ్డి కామెంట్స్…
స్వయాన వ్యవసాయదారుడైన నాకు వ్యవసాయ శాఖ సలహాదారులుగా నియమించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
రుణపడి ఉంటాను…
నా రాజకీయ జీవితమంతా కూడా వ్యవసాయం రైతులతో ముడిపడి కొనసాగింది…
1962 సంవత్సరం బాల్యంలోనే సింగిల్ విండో సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికై రైతులకు ప్రజలకు సేవలందించాను…
చంద్రఓబులు రెడ్డి హయాంలో డీసీఎంఎస్ డైరెక్టర్ గా ఉండి మైదుకూరు నియోజకవర్గంలో రైతులకు ఎరువులు అందించడంలో కీలక పాత్ర పోషించాను…
1978 సంవత్సరంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి డిఎల్ తరపున కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాను…
అనంతరం రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ప్రజలకు సేవ అందిస్తూ కొనసాగాను …
1981 లో రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేసి రైతులకు సేవలు అందించాను…
1988- 89లో డిసిసిబి ట్రెజరర్ గా ఎన్నుకోవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు గా కోనసాగి ప్రజలకు సేవలందించాను…
2011 సంవత్సరంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో నేను ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సేవలందించాను…
2013లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిసిసిబి చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది…
అయితే కొంతమంది కుట్ర దారులు తనపై కుట్ర పన్ని సంవత్సరానికే చైర్మన్ పదవికి ఎసరు పెట్టారు…
అయినా ఏ మాత్రం సడలకుండా ప్రజలకు సేవలు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలందించాను…
నా జీవిత కాలంలో నేను చేసిన పదవులు అన్ని కూడా వ్యవసాయము, రైతులకు సంబంధించినవే కావడం విశేషం…
గత సంవత్సరం వరకు నేను 20 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసే వాడిని…
నా కోరిక మేరకు వ్యవసాయ శాఖ సంబంధించిన పదవి ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిగారికి,వైయస్ అవినాష్ రెడ్డికి రుణపడి ఉంటాను.