భారత్ న్యూస్/మైదుకూరు
శనివారం ఉదయం 9 గంటలకు కడప నగరం మద్రాసు రోడ్డులో మున్సిపల్ స్టేడియంలో నిర్వహించబోయే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీ ని విజయవంతం చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మైదుకూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, అధ్యక్షులు, పురపాలక అధ్యక్షులు, కౌన్సిలర్లు, జడ్పిటిసిలు ,ఎంపీటీసీలు, సర్పంచ్లు, సొసైటీ ప్రెసిడెంట్, గ్రామ వార్డు మెంబర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వివిధ అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు,వైసిపి పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.