కడప జిల్లా మైదుకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పక్కన మైదుకూరు ప్రాంత దస్తావేజులేఖర్ల నిరసన నాలుగో రోజు కొనసాగుతోంది. కడప జిల్లాతో పాటు,రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో గత నాలుగు రోజులు గా దస్తావేజులేఖర్లు పెన్డౌన్ నిరసన కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజుల నుండి కడప జిల్లాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనితో ఆస్తులు అమ్మకందారులు, కొనుగోలుదారులు అయోమయంలో ఉన్నారు. దస్తావేజు రైటర్ల పెన్డౌన్ తో నిత్యం రద్దీగా కనిపించే మైదుకూరు రిజిస్టర్ కార్యాలయం బోసిపోయింది . ప్రైమ్ 2.0 విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిని కొనసాగించాలని, మైదుకూరు దస్తావేజు రైటర్లు నినాదాలు చేస్తూ కార్యాలయ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు రైటర్లు సుధీర్, సామెల్, సుధాకర్, శ్రీనివాసులురెడ్డి, నారాయణ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరులో నాలుగో రోజు కొనసాగుతున్న దస్తావేజులేఖర్ల నిరసన…
RELATED ARTICLES