భారత్ న్యూస్/మైదుకూరు…
మైదుకూరు పట్టణం కడప రోడ్డు మేధా డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల కు ఆర్మీ ర్యాలీ,అవగాహన సదస్సు ఆ సంస్థల చైర్మన్ నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్మీ అగ్నిపథ్ గురించి ఆర్మీ అధికారులు పూర్వ విద్యార్థులు ఆర్మీ అధికారులు విద్యార్థుల కు వివరించారు. అగ్నిపథ్ పై అపోహలు వద్దన్నారు.నాలుగు సంవత్సరాల్లో 24 లక్షలు సంపాదించవచ్చన్నారు. దేశ సేవ గా చూడాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అగ్నిపథ్ దోహద పడుతుందన్నారు.అగ్నిపథ్ కు రెండు రోజుల్లో 182000 దరఖాస్తులు వచ్చాయి అంటే యువత స్పందన ఎలా ఉందో మనం అర్థము చేసుకోవచ్చు అన్నారు.డిఫెన్స్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్ అని చాలామంది అనుకోరు అన్నారు.ఇతర దేశాల్లో విద్యార్థులకు చదువుతోపాటు ఆర్మీ శిక్షణ ఇస్తారన్నారు.లక్షల రూపాయల వెచ్చించి ఇతర ప్రాంతాల్లో ట్రైనింగ్ తీసుకొనే అవసరం లేకుండా మైదుకూరు లో మేధా డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం విద్యార్థుల కు సువర్ణావకాశం అన్నారు. అనంతరం విద్యార్థులకు 1600 మీటర్ల పరుగు పందాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మేధా విద్యా సంస్థల చైర్మన్ నరసింహులు, ప్రిన్సిపల్ సావిత్రి ,ఆర్మీ అధికారులు వెంకట్, ఎన్సిసి అధికారి ఏపీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.