మన భారత్ న్యూస్ /చాపాడు
చాపాడు మండలం పరిధిలోని చీయ్యపాడు గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు విద్యుత్ షాక్ తో మృతి చెందడం అదే గ్రామానికి చెందిన రాంబాబు ప్రమాదంలో మృతి చెందడం తో ఇంటి యజమానిని కోల్పోయి విషాదంలో ఆ కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విశ్వనాధపురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరగం రెడ్డి కార్తిక్ రెడ్డి మానవత్వంతో, ఉదారభావంతో ఆపన్న హస్తమందించారు. చియ్యపాడు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, రాంబాబులు ప్రమాదాలలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబాలనుకార్తీక్ రెడ్డి పరామర్శించి, శోకసంద్రం లో ఉన్న ఆ కుటుంబ సభ్యులనూ ఓదార్చి ధైర్యం చెప్పి నేనున్నానంటూ భరోసా కల్పించి ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని పెద్దకొడుకుగా తాను ఉంటానని ధైర్యం చెప్పారు. రాంబాబు కూతురుకు తాను కోరుకున్న కాలేజీలో ఇంటర్మీడియట్ సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి తాను సేవ చేస్తానని వారికి తన స్థాయికి తగిన సహాయం చేశానని పేర్కొన్నారు. త్వరలో ట్రస్టు ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తానని ఈ సందర్భంగా తెలిపారు.