మన భారత్ న్యూస్/ మైదుకూరు
మైదుకూరు :ఫ్రెండ్స్ ఫరెవర్ ఎన్జీవో సంఘం 5వ వార్షికోత్సవం సందర్బంగా మైదుకూరులో వికలాంగులకు మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి మొహిద్దీన్ చేతుల మీదుగా వీల్ఛైర్లను పంపిణీచేశారు.15 మంది మిత్రబృందం ఒక సంఘంగా ఏర్పడి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పడిన ఈ సంఘమే ఒక సంస్థగా మారి ప్రజలకు ఆర్గాన్ డొనేషన్ యొక్క ఆవశ్యకతను..కరోనా కష్టకాలంలో నిర్భాగ్యులకు అనాథలకు అన్నదానం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడమే కాకుండా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజూ భోజన సౌకర్యం కల్పిస్తూ ప్రజలకు అనేక రకాలుగా సేవ చేస్తూ విజయపథంలో ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మైదుకూరు నియోజకవర్గంలో వికలాంగులకు నడవలేని స్థితిలో ఉన్న రోగులకు సుమారు 40 వీల్చైర్స్ పంపిణీ చేసి అవకాశం కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథిగా వచ్చిన మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి మొహిద్దీన్ మాట్లాడుతూ చిన్న వయసులో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో యువతీ యువకులు ఒక సంస్థగా ఏర్పాటు చేసుకొని సమాజ శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం అన్నారు ఫ్రెండ్స్ ఫరెవర్ సంస్థవారు గత ఐదు సంవత్సరాలుగా ఆర్గాన్ డొనేషన్ అన్నదానం నేడు వీల్చైర్స్ పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చెయ్యడంతో నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని దేశంలోని యువకులంతా సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన అమ్మ సేవాసమితి ఆదరణ సేవాసంస్థ కార్ క్లబ్ పౌండేషన్ హెల్ప్ మేట్స్ సేవాసంస్థ చేయూత చారిటబుల్ ట్రస్ట్ కేయస్సార్ హరిత ఫౌండేషన్ మ్యాజిక్ హ్యాండ్ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్వాలా నరసింహశర్మ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు న్యాయవాది దాసరి బాబు ప్రముఖ న్యాయవాదులు ఏవీ రమణ మూలే నాగిరెడ్డి వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షులు లింగన్న ఎస్ఎల్లార్ హాస్పిటల్ అధినేత మూలే భరత్ కుమార్ రెడ్డి.. మేము సైతం అంటూ ఎన్నో అనాథ శవాలకు దహన సంస్కారాలు జరుపడమే కాకుండా వారి అస్తికలను కాశీ గంగా నదిలో కలిపే వంక ధార రాము వీల్చైర్ అందుకుంటున్న దివ్యాంగులతో పాటు వారి బంధువులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఫ్రెండ్స్ ఫరెవర్ సంస్థ భోజన వసతిని కల్పించారు.నడవలేని స్థితిలో వీల్చైర్లు అందుకున్న దివ్యాంగులు వారి కుటుంబసభ్యులు సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు.