మన భారత్ న్యూస్ /మైదుకూరు
మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలవాలి అని కోరుతూ మైదుకూరు పట్టణ టీడీపీ నాయకులు మరియు యువ నాయకులు యాపరల చిన్న(వెంకట రమణ ), బూరుగోళ్ళ చిన్న, గోవింద్, యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరుమల కు మొక్కుబడిగా పాదయాత్ర చేపట్టారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, యువ నాయకులు డాక్టర్పు పుట్టా రవికుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .రవి కుమార్ గారు ముందుగా శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, తీర్తప్రసాదాలనూ అందజేశారు.అనంతరం గ్రామదేవత పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించి, జెండా ఊపి పాదయాత్రనుప్రారంభించారు. పాదయాత్రలో వందలాదిమంది యువకులు, మహిళలు, వెంకటేశ్వర స్వామి భక్తులు గోవింద నామ స్మరణ చేసుకుంటూ పాదయాత్రలొ పాల్గొన్నారు. ఈ, కార్యక్రమంలో టిడిపి పట్టాన్ని అధ్యక్షుడు దాసరి బాబు, చాపాడు మండల టీడీపీ ఇన్చార్జి అన్నవరం సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బి ఎన్ శ్రీనివాసులు, మిల్లు శీను, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనపాల జగన్, అన్నవరం సుధాకర్ రెడ్డి,టిడిపి పట్టణ ఉప అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సునీత, బి.ఎన్ నాగేశ్వరీ,గుత్తి నారాయణ,టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.