భారత్ న్యూస్/ మైదుకూరు
మైదుకూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ,టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు శ్రేణులు ఎయిర్ పోర్ట్ నుండి ఘన స్వాగతం పలికారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన తర్వాత మైదుకూరు నియోజకవర్గంకు రావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకొని పుట్టాకు పుష్పగుచ్చాలు అందించి, శాలువాలు కప్పి, స్వీట్ తినిపిస్తూ అభినందించారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు. వేలాది ద్విచక్ర వాహనాలతో ,వందలాది కార్లతో విమానాశ్రయం నుండి మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ఘన స్వాగతం పలికారు.
ఎస్… మీ వార్తలు, కధనాలు, చిత్రాలు బాగున్నాయి. భారత్ న్యూస్ బాగుంది. మీరు మరింత క్షేత్ర స్థాయిలో ఉన్న వార్తలు, కధనాలు ప్రజల ముందుకు తీసుకోని ప్రజాల తరపున నిలబడి, ప్రజలు మన భారత్ న్యూస్ అనేలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. జై భారత్ 🙏
కృతజ్ఞతలు అన్నా.. తప్పకుండా మీరు భావించిన పని చేసేలా కృషి చేస్తాను
Tq
థాంక్స్ అన్న