భారత్ న్యూస్/మైదుకూరు
మైదుకూరు పట్టణంలోని ప్రధాన రహదారులలో ఆవులు ,పశువులను రోడ్ల మీద వదిలిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రాముడు యజమానులను హెచ్చరించారు. ఈ పశువులు రోడ్డుపై ఎటుపడితే అటు అడ్డంగా తిరగడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పాటు అనేకమంది ప్రయాణికులు ప్రమాదాలకు గురై ఆసుపత్రులలో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు రోడ్లను శుభ్రం చేసిన తర్వాత పశువులు మలమూత్ర విసర్జనతో అపరిశుభ్రంగా తయారవుతున్నయాన్నారు. పశువుల యజమానులు ఏడు దినములలో లోపల రోడ్లపై ఉన్న ఆవులు పశువులను తీసుకెళ్లాలని లేనిపక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని బందలదొడ్డికి తరలించడం జరుగుతుందన్నారు. ఈ నిబంధనను దిక్కరించి వస్తువులను రోడ్లపై వదిలితే జరిమానాతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.