ధనార్జనే ధ్యేయంగా భద్రకాళీ దేవస్థానం
వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీ దేవస్థానంలో అరకొర వసతులతో చుక్కలు చూస్తున్న భక్తులు ,కనీస అవసరాలు కల్పించలేక పోతున్న దేవస్థానం.నిత్యం రద్దీగా ఉండే దేవస్థానంలో నీటి సౌకర్యం లేకపోవడం,ప్రసాదాలు అందుబాటులో లేకపోవడం ఆలయ సిబ్బంది నిర్లక్షవైఖరి వెరసి భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.ఆలయ ఈ.ఓ.తగు చర్యలు తీసుకొని భక్తులకు కనీస సౌకర్యాలు కలిగించాలని భక్తులు కోరుకుంటున్నారు.టోకెన్లు లేకుండ ప్రసాదం వితరణ వల్ల చాలా అవక తవకలకు సిబ్బంది పాల్పడుతున్నారు.కొంత ప్రసాదానికి మాత్రమే టోకెన్లు ఇస్తు మిగిలిన ప్రసాదాలకు టోకెన్లు ఇవ్వకపోవడం వల్ల దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.