వరంగల్ లో టీసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం
ముఖ్య అతిధి గా పాల్గొన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి
టీసీఏ ప్రెసిడెంట్ గా యెండల లక్ష్మీనారాయణ
జనరల్ సెక్రటరీ గా ధరం గురువా రెడ్డి .
ఈ కార్యక్రమంలో తెలంగాణ లోని అన్ని జిల్లాల నుండి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా
అద్యక్షులు, సెక్రటరీ లు , కోచ్ లు, సీనియర్ క్రికెటర్లు.. సీనియర్ మహిళా క్రికెటర్లు ఈ సమావేశంలో లో పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ లో 6 తీర్మానాలను ఆమోదించింది.
- గ్రామీణ స్థాయిలో క్రికెటర్లను ,ప్రోత్సాహించడానికి ,క్రికెట్ ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ లో మహిళా క్రికెటర్లకు చేర్చడం
- టి సి ఏ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మరియు గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడం
3.బీసీసీఐ ఫార్మాట్ తో సమానంగా మల్టీ డే లీగ్ ను నిర్వహించడం
4.బీసీసీఐ గుర్తింపు కోసం కృషి చేయడం
5.జూన్ లో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అజాది కా అమృత్ మహోత్సవ్
- జూన్/జులై లో TSPL ని నిర్వహించడం
కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ…. మొదట్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లో చేరడానికి చాలా ఆలోచించా… బీసీసీఐ గుర్తింపు ఇవ్వదని వాదించా…కానీ గత ఎనిమిది ఏళ్లుగా TCA గ్రామీణ క్రికెటర్లకు చేసిన సేవ చూసి ఆనందంగా ఉంది. ఆర్థికం గా బలిష్టంగా ఉన్న HCA ను తట్టుకొని ప్రతీ ఏడాది బీసీసీఐ ఫార్మాట్ లో కొన్ని వందల మ్యాచ్ లను తెలంగాణ జిల్లాలలో TCA ఆడించింది. మేము ప్రతి ఒక్క విషయం లోను నిజాయితీగా, నిబద్ధత తో పని చేస్తున్నాం. ఆర్థిక కష్టాలు ఉన్న క్రికెట్ ను ఆడిస్తున్నాం. ప్రతీ ఏడాది ఆడిటింగ్ ని కూడా వెబ్సైట్ లో పెడ్తున్నాం…అందుకే TCAలో కొనసాగడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది లోపు బీసీసీఐ అసోసియేట్ మెంబెర్ గా గుర్తింపు ఇవ్వబోతోంది అని టీసీఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.