జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి … ఎస్పీ కి ఏపీయూడబ్ల్యూజే వినతి

కడప : వేంపల్లి లో విలేకరుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కి APUWJ ఆద్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు.. ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే కవరేజ్ చేయడానికి వెళ్లిన 9 మంది పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించారని జిల్లా ఎస్పీకి సమర్పించిన వినతి పత్రంలో APUWJ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.. ఇసుక తరలిస్తున్న ప్రాంతంలో అనుమతులు లేవని స్వయానా స్థానిక రెవెన్యూ అధికారులు చెబుతున్నప్పటికీ జెపి కన్స్ట్రక్షన్ వారు ఇసుకను తరలిస్తున్నటువంటి విషయాన్ని ఎస్పీ దృష్టికి జర్నలిస్ట్ సంఘాల నేతలు రామసుబ్బారెడ్డి , నారాయణ , శ్రీనాథ్ రెడ్డి వివరించారు. ఫిర్యాదు దారుడు తన ఫిర్యాదులో జర్నలిస్టు పనిచేసే సంస్థలను నమోదు చేయకుండా స్థానిక ఎస్ఐ తిరుపాల్ నాయక్ అత్యుత్సాహంతో మీడియా సంస్థల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారని వారు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.. జర్నలిస్టు సంఘాల నేతల వాదనకు జిల్లా ఎస్పీ స్పందిస్తూ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేయించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘాల నేతలు రామాంజనేయులు రెడ్డి , నూర్ భాషా , శివకేశవ రెడ్డి , సిద్దయ్య , సుబ్బారెడ్డి , రాజు జర్నలుస్టులు బాలకృష్ణ , జయచంద్ర , ఏవి సుబ్బారెడ్డి , రఘనాధరెడ్డి , ఖదీర్ , గఫార్ రహీం తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular