చదరంగం పోటీల్లో బీరం విద్యార్థుల విజయం...
మన భారత్ న్యూస్ /ఖాజీపేట
“ఆట ఆడాలంటే శారీరక బలమే కాదు మానసిక బలం కూడా కావాలని బీరం విద్యార్థులు నిరూపించారు .”
కడప మున్సిపల్ గ్రౌండ్ మైదానంలో డీ.ఎ.స్సీ ఆధ్వర్యంలో ఎస్.జి ఎఫ్.ఐ నిర్వహించిన జిల్లా స్థాయి చదరంగం అండర్ -19 బాలుర విభాగంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల ఆణిముత్యాలైన పి.చండ్రాయుడు(బై.పి.సి) ప్రథమ స్థానం మరియు వి .ఓబుల్ రెడ్డి(ఎం.పీ.సి) ద్వితీయ స్థానం లో జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీ బీరం సుబ్బారెడ్డి సార్ గారు చైర్ పర్సన్ శ్రీమతి సరస్వతమ్మ గార్లు మాట్లాడుతూ విద్యార్థులు చదరంగం పట్ల చూపిన తెలివితేటలు మక్కువను కొనియాడారు. చదరంగం ఆట ఆడాలంటే ఎంతో నైపుణ్యం, మేధాశక్తి ,ఏకాగ్రత ఉండాలని ఆ లక్షణాలు తమ పిల్లల్లో పుష్కలంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు .
మరియు డైరెక్టర్ శ్రీమతి స్వాతి శ్రీకాంత్ గారు, ప్రిన్సిపల్ శ్వేతా మేడం గారు, కాలేజీ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి సార్ గార్లు మాట్లాడుతూ చదరంగం ఒక కష్టమైన ఆట అని అది ఆడాలంటే మానసిక బలం కావాలని చెప్పారు .
తమ విద్యార్థులు శారీరక క్రీడల్లోనే కాకుండా మానసిక క్రీడల్లో కూడా గెలుపు సాధించినందుకు వారు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు . మరియు విద్యార్థులను చదరంగం లో గెలుపొందేందుకు మానసికంగా తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులైన చి .చిన్నయ్య, కె .అంజి ,డి. రమేష్ లను వారు తమ సంతోష సత్కారాలతో అభినందించారు .