కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పుట్ట సుధాకర్ యాదవ్ జన్మదినం పురస్కరించుకొని మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో రక్తాన్ని దానం చేశారు. అనంతరం మైదుకూరు పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు ఆధ్వర్యంలో ఐదు మండల టిడిపి ఇన్చార్జిలు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి పుట్టాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సుధాకర్ యాదవ్ ప్రజలకు సేవ చేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవడమే దయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఘనంగా పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు…
RELATED ARTICLES