క్రీడ ఏదైనా స్థాయి ఏదైనా తగ్గేదేలే అంటున్న బీరం విద్యార్థులు…
కడప మున్సిపల్ గ్రౌండ్ ఆవరణలో డి ఎస్ ఏ ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ఐ నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ అండర్- 17 బాలుర విభాగంలో బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల్లో పదవ తరగతి చదువుతున్న పి.నాగేశ్వర్రెడ్డి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్. వెంకట సాయి అలాగే ద్వితీయ సంవత్సరం చదువుతున్న విష్ణువర్ధన్ రెడ్డి,జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్- 17విభాగంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎల్.బి.లహరి కూడా గెలుపు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయింది.
అలాగే బ్యాడ్మింటన్ అండర్- 19 బాలికల విభాగంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి. వీర తేజస్విని, కె.వేదామృత జిల్లా స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇక్కడ మరియు అండర్ 17 విభాగంలో 10వ తరగతి చదువుతున్న జీ నవోదయ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం తేజేశ్వర్ రెడ్డి మరియు అండర్ 14 9వ తరగతి చదువుతున్న వై సుశాంత్ రెడ్డి జిల్లాస్థాయి ఫుట్బాల్ పోటీలలో గెలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు
ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శ్రీ సుబ్బారెడ్డి గారు చైర్ పర్సన్ శ్రీమతి సరస్వతమ్మ గారు మాట్లాడుతూ తమ విద్యార్థులు సాధిస్తున్న వరుస విజయాలకు సంతోషించి ఏ క్రీడల్లో అయినా గెలుపు తమ విద్యార్థుల సొంతమని సగర్భంగా తెలియజేశారు. అలాగే డైరెక్టర్ శ్రీమతి స్వాతి శ్రీకాంత్ గారు, ప్రిన్సిపల్ శ్వేత గారు కాలేజ్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ గెలుపు సాధించిన విద్యార్థులను అభినందించి వారు రాష్ట్ర స్థాయిలో కూడా విజయాన్ని కైవసం చేసుకోవాలని ఆశీర్వదించారు. అలాగే విద్యార్థులను విజేతలు గా మార్చిన పీఈటీలు సాయి జ్యోతి, కీర్తన,మహమ్మద్ రఫీ చిన్నయ్య, రమేష్ లను అభినందించారు.