భారత్ న్యూస్…
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియూసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన ఏఐటియూసి జిల్లా కార్యదర్శి పి. శ్రీరాములు, ఏఐటియూసి మైదుకూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పి.భాస్కర్, ఏ.వి. శివరాములు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల వల్ల సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాసి కార్మికుల హక్కులను కాలరాస్తుందని, దేశాన్ని తిరోగమనం వైపు అభివృద్ధి ముసుగులో పెడుతున్నదని తిరిగి 12 గంటలు 14 గంటలు పని చేయించడానికి కంకణం కట్టుకున్నదని కావున కార్మిక వర్గం మరో పోరాటానికి సిద్ధం కావాలనికోట్లాదిమంది కార్మికులు, ఉ ద్యోగులు తీవ్రంగా వ్యతి రేకి స్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం 4 కార్మిక కోడ్లను ఈ జులై 1వ తే దీ నుండి అమలు జరి పేందు కు బరితెగిస్తూ ఉంది. మన రా ష్ట్రంలో కూడా రూల్స్ తయా రుచేసి అమలు జరిపేందుకు సన్నద్ధులవుతున్నారు అన్నారు.