కుందూ నది మట్టితో వైసిపి నాయకులు అవినీతి కి తెగబడ్డారు…

1000 కోట్ల అవినీతి నిలువెత్తు సాక్ష్యం విస్తరణ పనులు…

మైదుకూరు టిడిపి ఇన్చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్

భారత్ న్యూస్ /మైదుకూరు

కుందున్నది విస్తరణ పనులు అవినీతికి కేరాఫ్ గా మారాయి ఆని, వైసీపీ నాయకులకు దోచి పెట్టేందుకే ఈ పనులు చేపట్టారని ,1000 కోట్ల అవినీతికి వైసిపి నాయకులు తెగబడ్డారని మైదుకూరు టిడిపి ఇన్చార్య పుట్ట సుధాకర్ యాదవ్ ఆరోపించారు. చాపాడు మండల పరిధిలోని కుందూ నదిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కుందు నదిలో మట్టి దోపిడీకి వైసీపీ నాయకులు తెగబడ్డారు అన్నారు.కోట్ల రూపాయల మట్టిని అమ్ముకుంటున్నారు..
ఇది వెయ్యి కోట్ల కుంభకోణం..
రైతులకు ఒక్క రూపాయికి దక్కాల్సిన మట్టిని అమ్ముకుంటున్నారు అన్నారు.
2400 కోట్ల ఈ కుందూ విస్తరణ పనుల్లో 400 భూ సేకరణ పనులు అన్నీ అవకతవకలు జరిగాయి అన్నారు.2.5 టి.ఎం సి రాజోలి ఆ నకట్ట, జొలదరాసి, తెలుగు గంగ ప్రాజెక్టు పనులు ఉన్నాయి..120 కిలోమీటర్లు పనులు చేయాల్సి ఉంటే డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేస్తున్నారు.రివర్స్ టెండర్ ప్రక్రియ క్రింద చేపట్టలేదు..ఎస్ ఆర్ రెట్లకే పనులు అప్పగించారు..
ఇందులో మతలబు ఉంది అన్నారు.7 కోట్ల క్యూబిక్ మీటర్ల సిల్టు పనులు ఎందుకు చేస్తున్నారు..
దీనిపై ఏమీ ప్రేమ అని ప్రశ్నించారు.నిజంగా కట్టాల్సిన ప్రాజెక్టు ప్లాన్, ప్రతిపాదనలు తయారు చేయకుండా కేవలం మట్టి తొలగింపు మాత్రమే చేస్తున్నారు అన్నారు.
కుందూ నదిలో తీసిన మట్టిని అమ్మడం, తరలించడం నేరం అన్నారు.రైతులకు ఒక్క రూపాయికి ప్రభుత్వ జీవో ప్రకారం మట్టి ఇవ్వాల్సి ఉండగా రైతులకు ఇవ్వకుండా దౌర్జన్యంగా అమ్ముకుంటున్నారు అన్నారు.
రైతుల పిర్యాదు మేరకు ఈ అక్రమ ఇసుక తరలింపు పై అరా తీస్తే మట్టి దోపిడీ బయట పడింది అన్నారు.79 జీవో ప్రకారం అక్రమ మట్టి తరలింపు చేస్తే..లక్ష వరకు జరిమానా వేయాలి అన్నారు.
అక్రమ మట్టి తరలింపు పై విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ కు పిర్యాదు చేస్తాం అని హెచ్చరించారు.
చట్టం ప్రకారం ఇంజనీర్లు పర్యవేక్షించడం లేదు..0 నుండి 83 కిలో మీటర్ల వరకు మట్టి ఎక్కడ పోయిందో చెప్పాలి అన్నారు.టెండరు నిబంధనల ప్రకారం అధికార్లు చర్యలు చేపట్టాలి అన్నారు.
రైతులు కూడా జీవో 74 ద్వారా ఒక్క రూపాయికి ఒక టన్ను మట్టిని పొందే వీలుంది కానీ
ఇక్కడ మట్టిని నిబంధనలకు విరుద్ధంగా ప్రొద్దుటూరులో రియల్ ఎస్టేట్స్ తరలిస్తూ మా కంట పడింది..
ఒక టిప్పర్ 6 వేలు వసూలు చేస్తున్నారు అన్నారు.
700 కోట్ల పనుల్లో వెయ్యి కోట్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్న రు అన్నారు. కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి పొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి టిడిపి నాయకులు పాల్గొన్నారు

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular