మైదుకూరు
పట్టణం లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 98 డీఎస్సీ బ్యాచ్ కి చెందిన ఉపాధ్యాయులు కె. వి రామకృష్ణ ఆధ్వర్యంలో మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర గారితో కలిసి శ్రీకృష్ణదేవరాయల కూడలిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనేక సంవత్సరాలుగా నిరీక్షించిన తమకు ఉద్యోగాలు కల్పించిన ఉద్యోగ ప్రదాత సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ సాయి, గంగాధర్ రెడ్డి, నారాయణరెడ్డి, పుల్లయ్య, రామకృష్ణారెడ్డి మరియు వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ ప్రదాత సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం…
RELATED ARTICLES