ఆలోచన ,ఆశయాల ప్రతిరూపమే బీరం పాఠశాల

అంబరాన్ని అంటిన సంబరాలు

మనిషికి మరణం ఉంటుంది కానీ వారి ఆలోచనలకు మరణం ఉండదు. తనువు చాలించినా కూడా వారి ఆలోచనలు, ఆశయాలు ఎల్లప్పుడూ కీర్తిని ఘటిస్తూ, అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి బీరం శ్రీధర్ రెడ్డి గారు. అతని కలల సౌధానికి నిలయమే ఈ బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాల.నేడు శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల ఆవరణలో ఫౌండర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా శ్రీమతి విజయలక్ష్మి డిప్యూటీ కమిషనర్ -సేల్స్ టాక్స్, శ్రీ బీరం శ్రీకాంత్ రెడ్డి గారు ఓ.ఎస్.డి.to విప్,శ్రీ పి.రామచంద్రారెడ్డి గారు రిజిస్టార్ - సింహపురి యూనివర్సిటీ నెల్లూరు, శ్రీ డాక్టర్ సురేష్ గారు సీనియర్ జర్నలిస్ట్- యోగివేమన యూనివర్సిటీ, కడప,  శ్రీ ఖదీర్  గారు ఎంపీడీవో -వి.ఎన్ పల్లి.

గార్లు విచ్చేశారు.

మొదటగా అతిధులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలిచి గొప్ప కీర్తి ప్రఖ్యాతలను పొందుతున్నారని అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ఈ విద్యాసంస్థ అందుబాటులో ఉందని చెప్పారు. విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసి అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని మరియు ఉన్నత ర్యాంకులు సాధించడానికి యాజమాన్యం వారు వినూత్న ఆలోచనలతో నూతన సంస్కరణలతో, నిరంతర అధ్యాపకుల పర్యవేక్షణలో ముందుకు సాగుతున్నారని వారు తెలియజేశారు. ఇలాంటి గొప్ప విద్యాసంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉత్తమ పౌరులుగా నిలుస్తారని వాళ్లు తెలిపారు.

ఫౌండర్స్ డే వేడుకలో కరస్పాండెంట్ బీరం సుబ్బారెడ్డి గారు,చైర్ పర్సన్ సరస్వతమ్మ గారు డైరెక్టర్, స్వాతి శ్రీకాంత్ గార్లు మాట్లాడుతూ బీరం శ్రీధర్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఒక నగరంలోని అమెజాన్ బ్రాంచ్ కు సీఈఓ గా ఎదిగి, నూతన ఆవిష్కరణలు గావించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని,అలాగే రాబోయే తరంలోని విద్యార్థులందరూ ఇంకా మంచి విద్యను అభ్యసించి గొప్ప సంస్థలకు అధిపతులుగా నిలిచి అత్యున్నత స్థానంలో నిలవాలని, భవిష్యత్తులో రాబోయే తరాల వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే శ్రీధర్ రెడ్డి ఆలోచన మరియు ఆశయం. ఆ ఆలోచన, ఆశయ సాధనల రూపానికి ప్రతిబింబమే బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల మరియు కళాశాలలని ఈ వాటి అభివృద్ధి కోసం,శ్రీధర్ రెడ్డి గారి ఆశయాల కోసం తాము నిరంతరం కొవ్వొత్తి లాగా కరిగి ఫలితాల విజయాన్ని జ్యోతి లాగా వెలిగిస్తామని వారు పేర్కొన్నారు.

రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమాన్ని అలరించారు. మరియు వివిధ అంశాలలో విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిధులు బహుమతులు అందజేశారు.

ఈ ఫౌండర్స్ డే వేడుకలో బీరం పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా గారు, కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ గారు మరియు ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular