భారత్ న్యూస్/ మైదుకూరు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లి పంచాయతీలో అమృత్ సర్వర్ కార్యక్రమాన్ని కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ జీవరాసి ఆయువుకు అభివృద్ధికి నీరే ఆధారమని పేర్కొన్నారు. ఉపాధి కూలీలు అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ, ఆర్డీవో వెంకటరమణ, పిడి భూషణ్ రెడ్డి, జడ్పిటిసి గోవిందరెడ్డి ,ఎంపీపీ వీరనారాయణరెడ్డి ,మల్లేపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి, స్థానిక నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.