ఘనమైన గణితానికి ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించిన బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాల
అతి చిన్న వయసులోనే అపారమైన మేధస్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త అయిన శ్రీ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా నేడు బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
మొదటగా శ్రీ రామానుజన్ గారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన పాఠశాల మరియు కళాశాల కరస్పాండెంట్ అయిన బీరం సుబ్బారెడ్డి గారు మరియు చైర్పర్సన్ సరస్వతమ్మ గారు మాట్లాడుతూ అన్ని శాస్త్రాలకు రారాజైన గణితం పట్ల పిల్లలు మక్కువ చూపాలని, గణితంలో అపారమైన ఘనతను పొందాలని వారు తెలియజేశారు మరియు గణిత శాస్త్రజ్ఞుల గురించి, వారు సాధించినటువంటి ఫలితాల గురించి పిల్లలకు వారు చక్కగా తెలియజేశారు.
బీరం విద్యా సంస్థల డైరెక్టర్ బీరం స్వాతి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ప్రతిరోజు మన దినచర్య గణితంతోనే ప్రారంభమవుతుందని, మనం చేసే ప్రతి పని ఏదో ఒక విధంగా గణితంతోనే ముడిపడి ఉంటుందని, పిల్లలు గణితంలో రాణించగలిగితే వారు అన్ని రంగాలలో ఉన్నత స్థానాలు సాధిస్తారని, అలాగే మన పాఠశాలలో ఎక్కువ శాతం విద్యార్థులు గణితం పట్ల మక్కువ చూపుతున్నారని తెలియజేశారు.
విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాలు,పాటలు పాడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా గారు, గణిత శాస్త్ర అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, వ్యాయామ శిక్షణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.